
దీంతో ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ టీం అంటూ అందరూ ఇక ఈ టీంను పొగడటం మొదలు పెట్టారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇలా టైటిల్ విజేతగా నిలిచి ప్రశంసలు అందుకుంటుంది. కానీ ఆ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న ఒక ప్లేయర్ మాత్రం చెత్త ప్రదర్శనతో చెత్త రికార్డు మూటగట్టుకుని విమర్శలు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఇలా చెన్నై గెలిచినా విమర్శలు ఎదుర్కొంటున్న ప్లేయర్ ఎవరో కాదు తుషార్ దేశ్పాండే. ఇతను చెన్నై జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. ఏకంగా 16 మ్యాచ్లలో 21 వికెట్లు కూడా తీశాడు.
అదేంటి 21 వికెట్లు అంటే బాగానే బౌలింగ్ చేశాడు కదా.. ఇంకా చెత్త రికార్డు ఎందుకు అనుకుంటున్నారు కదా.. వికెట్లు అయితే తీశాడు కానీ పరుగులు కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒక ఐపిఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో 56 పరుగులు ఇచ్చుకున్నాడు ఈ బౌలర్. ఈ క్రమంలోనే ఈ సీజన్లో 16 మ్యాచ్ లలో లో కలిపి 564 రన్స్ ఇచ్చాడు. దీంతో గత సీజన్లో ప్రసీద్ కృష్ణ ఇచ్చిన 551 పరుగుల రికార్డును అధిగమించి చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రసీద్ కృష్ణ తర్వాత 553 పరుగులతో బ్రావో ఉన్నాడు.