
ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాగా రాణించిన ప్లేయర్స్ అందరూ కూడా అతి తక్కువ సమయంలోనే అటు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాము. దీంతో ఎంతోమంది ప్లేయర్స్ కూడా ఐపిఎల్ లో ఛాన్స్ దక్కించుకొని బాగా రానిస్తే చాలు ఇక దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనే కల నెరవేరుతుంది అని భావిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ దక్కుతుంది అనేదానికి నిదర్శనంగా ఇప్పుడు మరో ఘటన జరిగింది. 2023 సీజన్లో అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించిన సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది.
అయితే చెన్నై జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించడంలో ఆ జట్టులో యంగ్ బౌలర్ గా కొనసాగుతున్న శ్రీలంక బౌలర్ మతిషా పతిరణ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. తన ఫాస్ట్ బౌలింగ్తో అదరగొట్టాడు. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఈ బౌలర్కి ఐపీఎల్ ముగిసిన రోజుల వ్యవధిలోనే అటు శ్రీలంక తరపున వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేస్తే చాన్స్ దక్కింది. ఆఫ్ఘనిస్తాన్తో శ్రీలంక సొంత గడ్డపై ఆడుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవల తొలి వన్డే లో ఛాన్స్ దక్కించుకొని ఇక వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేసాడు. మరి అంతర్జాతీయ క్రికెట్లో అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారి పోయింది. కాగా ఐపీఎల్లో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.