
మూడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలి విషయంలో ఒక వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా భాగస్వామిని ముక్కలు చేసి ఆపై ఇక శరీర భాగాలను కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. ముంబైకి దగ్గర్లోని తానేలో ఈ ఘటన జరిగింది. మనోజ్ అనే 56 ఏళ్ల వ్యక్తి 36 ఏళ్ల సరస్వతి తో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. తానేలోని మీరా బయన్దర్ ప్రాంతంలో అపార్ట్మెంటులో వీరు ఉంటున్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి కాస్త పెద్దవయ్యాయి. దీంతో విచక్షణ కోల్పోయిన మనోజ్ ఆమెను దారుణంగా చంపేశాడు.
ఏకంగా చెట్లు కోసే మిషిన్ తో సరస్వతి శరీరాన్ని ముక్కలుగా చేసి వాటిని రోజు కుక్కర్లో ఉడకబెడుతున్నాడు. అయితే అపార్ట్మెంట్ ఏడో ఫ్లోర్ లోని వారి ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో పోరుగంటి వారు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు లోపలికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంట్లో కుళ్లిపోయిన శరీర భాగాలను బట్టి హత్య జరిగి దాదాపు నాలుగు ఐదు రోజులవుతుందని పోలీసులు అనుమనిస్తున్నారు. ఇక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.మనోజ్ తో పాటు ఇద్దరు అనుమానితలను కూడా అదుపులోకి తీసుకున్నారు.