టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గత కొంతకాలం నుంచి భారత జట్టుకు దూరమైపోయాడు అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న జస్ ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఇక జట్టులో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎప్పుడు బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ ఇక ప్రత్యర్ధులను భయపెట్టే జస్ ప్రీత్ బుమ్రా ఇక వెనునొప్పి గాయం కారణంగా దాదాపు కొన్ని నెలల నుంచి క్రికెట్కు దూరంగానే ఉంటున్నాడు. అయితే వెనునొప్పి గాయానికి శాశ్వత పరిష్కారం కోసం చివరికి సర్జరీని ఆశ్రయించాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే బుమ్రా గాయంతో జట్టుకు దూరమవగా.. ఇక అతను లేకుండానే అటు భారత జట్టు కీలకమైన మ్యాచులు కూడా ఆడుతూ ఉంది అని చెప్పాలి. గత ఏడాది ప్రపంచకప్ సమయంలో కూడా అటు బుమ్రా జట్టుకు అందుబాటులో లేడు. ప్రస్తుతం భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో అటు జస్ ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. బుమ్రా ఉండి ఉంటే బాగుండేది అని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరగబోయే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కి అయినా బుమ్రా  అందుబాటులో ఉంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.



 ఇదే విషయంపై టీమ్ ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ స్పందిస్తూ ఇక భారత జట్టు అభిమానులందరికీ కూడా ఒక ఆగిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు.  ఐర్లాండ్తో జరగబోయే టి20 సిరీస్ ద్వారా బుమ్రా తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు దినేష్ కార్తీక్. అంతేకాదు వన్డే వరల్డ్ కప్ కి కూడా అందుబాటులో ఉంటాడు అన్న విషయాన్ని తెలిపాడు. అయితే ఈ విషయం తెలియడంతో ఇక క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. బూమ్రా వస్తే ఇక భారత జట్టుకు తిరుగు ఉండదు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: