తెలుగు సినిమాల లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన తీసిన మంచి సినిమాలు బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఏ దర్శకుడు తీసి వుండరు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో సేవలు చేశారు.ఇక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజా సేవ చేశారు. ఇక దాసరి గారంటే ఇష్టపడని కుటుంబాలు వుండవు. ప్రతి కుటుంబం కూడా ఆయన్ని సొంత కుటుంబ వ్యక్తిలా భావిస్తారు. అలా సమాజానికి ఎన్నో మంచి సినిమాలను అందించారు.ఇక దాసరి గారు అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు.దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా ఇంకా గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు.


అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, , మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి.


దాసరి తిసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌసల్యానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు , బహుమతులు అందుకున్నాడు.ఇలా ఎన్నో కుటుంబ కుటుంబ కథ అలాగే సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎంతమంది దర్శకులు వచ్చిన తెలుగు సినిమాకి దాసరి గారు ఆల్ టైం బెస్ట్ డైరెక్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: