తెలుగు నటులు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే అంత ఆషామాషీ కాదు. హాలీవుడ్ నటన అంటే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాలి. అలా ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీలో మంచి స్టార్ పొజిషన్ కు వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా హాలీవుడ్ లో ట్రై చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటికే తమిళ నటుడు స్టార్ హీరో విజయ్ దళపతి కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ అక్కడ సక్సెస్ ను అందుకోలేకపోయాడు. కానీ మొట్టమొదటిసారిగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి విజయం అందుకున్న ఏకైక తెలుగు నటుడు రాజనాల గారు. ఈయన 1960వ సంవత్సరంలో " మాయా ది మెగ్నీషిమెంట్" అనే చిత్రం ద్వారా హాలీవుడ్ లోకి అడుగు పెట్టి, హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగు బిడ్డగా, తెలుగు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. ఈయన 1925 జనవరి 3వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు. 1948వ సంవత్సరంలో ఇంటర్ చదువుతున్న సమయంలోనే, తన మిత్రుడు లక్ష్మి కుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక ఈ సంస్థ ద్వారా ఎవరు దొంగ, ప్రగతి వంటి నాటకాలను ప్రదర్శించారు. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం లో పనిచేస్తున్న రాజనాల పై, కలెక్టర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి వై ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి నాటకాలలో నటిస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం ఇక అయినా కూడా ఆయన మానుకోలేదు. ఇక కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ , బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేశారు రాజనాల. ఇక 1951లో రాజనాల మిత్రుడు లక్ష్మి కుమార్ రెడ్డి నుండి మద్రాస్ కు పిలుపు వచ్చింది ఇక అప్పటికే లక్ష్మి కుమార్ రెడ్డి నిర్మాత హెచ్.ఎం.రెడ్డి వద్ద పని చేస్తున్నారు. ఇక 1953వ సంవత్సరంలో ప్రతిజ్ఞ సినిమాలో మొదటిసారిగా విలన్ పాత్రకు రాజనాలను ఎంచుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమా మంచి విజయం పొంది అందరికీ గుర్తింపు తీసుకొచ్చింది.
అలా విలన్ గా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి , తన 40 సంవత్సరాల సినీ జీవితంలో దాదాపుగా నాలుగు వందల సినిమాలకు పైగా నటించి, ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి