మనం నిద్రించే సమయంలో మనందరికీ కలలు రావడం అనేది అత్యంత సాధారణమైన విషయం. మనం నిజ జీవితంలో నిద్రలోకి జారుకున్నప్పటికీ వర్చువల్ ప్రపంచంలో మేల్కొనే ఉంటాం. అలాంటి సమయంలో కొందరికి అద్భుతమైన కలలు వస్తే.. మరికొందరికి పీడకలలు వస్తుంటాయి. ఇవి నిజ జీవితంలో నిజమవుతాయా? లేదా అనే విషయాలు కొందరిని కలవరపెడుతుంటాయి.