తెలుగు పండుగ అట్ల తద్దిని.. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీపూజచేసి 10 అట్లు నైవేద్యంగాపెట్టాలి. అనంతరం ముత్తైదువులకు అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అవివాహిత యువతులకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తిని భర్తగా లభిస్తాడని, పెళ్లైన వారికి సంతానం కలుగుతుందని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు... అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు..