ఆ భగవంతుడైన శ్రీ కృష్ణుడు తాను చెప్పిన భగవద్గీతలో ఎన్నో విషయాలను మానవ జాతికి ఉపయోగపడే వాటిని తెలియచేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్తినే 'సంస్కారం' అంటారు. చాలా కాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని మనల్ని అంటిపెట్టుకొనుండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు.