ఒకదేవాలయములోని ఆ గ్రామమునగల బాపనవారి కుంచము, రాచవారి కుంచము, కోమటివారి కుంచము, కాపువారి కుంచములు వచ్చి పోవుచుండుట ఆచారము. కాని, ఒకనాటి సమావేశమునకు బాపనవారి కుంచము రాలేక మరునాడు వచ్చినందున మిగిలిన మూడు కుంచములు నిన్న నీవు రాలేదమని అడుగగ నాకుంచము రాత్రి మా యజమానురాలు నాపై సోలెడు నూకలు పోసి నాపై చేటమూతబెట్టినందున నేను రాలేకపోయితినని చెప్పగ మిగిలిన కుంచములు పకపక నవ్వినవి.