ఇది పరమ శివుని చేత చెప్పఁబడినది. ఈ సూర్యాష్టకం ప్రతిరోజూ ఒకసారి చదువుకుంటే గ్రహపీడ తొలుగుతుంది. ఏడు జన్మలలో చేసిన పాపము పోతుంది. రోగము నశిస్తుంది.    ఆరోగ్యంగాఉంటారు.

మరియు ప్రతి ఆదివారం నాడు తప్పని సరిగా చదివితే 

ఆమిషం (మాంసం) మధుపానం (మద్యపానం) స్త్రీ (వ్యామోహం)మెదలగు వాటిని వదిలిపెడతారు. 

వ్యాధి, శోకం, దారిద్ర్యం  లేనివారై  బ్రతికిఉన్నంతకాలము సుఖంగా జీవించి చివరిలో సూర్య లోకం చేరుతారు. 

 

💐 శ్రీ సూర్యాష్టకం 💐

 

ఓం శ్రీ గణేశాయ నమః

ఓం శ్రీ ఛాయా ఉషా పద్మినీ సమేత                       ఓం శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతాపరబ్రహ్మాణేనమః

 

💐హరిః ఓమ్💐

 

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర|

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే||1||

 

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం|

శ్వేత పద్మధరందేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||2||

 

లోహితం రధమారూఢం సర్వలోక పితామహం|

మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||3||

 

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం|

మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||4||

 

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ|

ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్||5||

 

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం|

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||6||

 

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం|

మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||7||

 

తం సూర్యం జగతాం నాధం  జ్ఞాన విజ్ఞాన మోక్షదం|

మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||8||

 

ఫలశృతి— 

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం|

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్||

 

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే|

సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా||

 

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్దినే|

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి||

 

ఇతి శివ పురాణే రోగోపశమనే శ్రీ సూర్యాష్టకం సంపూర్ణమ్

 

ఏతత్ఫలం శ్రీ ఛాయా

 ఉషా పద్మినీ సమేత 

శ్రీసూర్యనారాయణమూర్తి దేవతా పరబ్రహ్మార్పణమస్తు.

మరింత సమాచారం తెలుసుకోండి: