హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. "కలౌ కపి వినాయకౌ"అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. "యత్ర యత్ర రఘునాథ కీర్తనం- తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్’" అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి