దాదాపు హిందువుల్లో ప్రతి దేవున్ని కూడా ఎక్కువ శాతం ఇంట్లో పెద్ద వాళ్లు పూజిస్తూ ఉంటారు. దానినే చిన్న వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. కానీ చిన్న , పెద్ద సంబంధం లేకుండా పోటీ పడి మారి దేవుని అలంకరించడం , దేవునికి సంబంధించిన పనులు చేయడం వినాయకుని విషయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వినాయక పండగ వచ్చింది అంటే చాలు చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఆ దేవునికి సంబంధించిన పనులు చేయడంలో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. వినాయకుడి కోసం పెద్ద ఎత్తున మండపాలను నిర్మించడం కోసం ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో కష్ట పడుతూ ఉంటారు. ఇక మండపం పూర్తి అయిన తర్వాత అద్భుతమైన వినాయకుడిని ఆ మండపంలో ప్రతిష్టించి దానికి పూజలు నిర్వహించే విషయంలో కూడా చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా మన హిందువులు వినాయకుని పండగ దగ్గర పడినప్పటి నుండి నిమర్జనం చేసే వరకు ఎంతో ఉత్సాహంగా ఆ పనులలో పాల్గొంటూ ఉంటారు. ఇకపోతే వినాయకుని పూజకు చాలా వస్తువులు అవసరం ఉంటుంది. మరి వినాయకుని పూజకు ఏమేం వస్తువులు అవసరం ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందాం.

వినాయక చవితి రోజున వినాయకుని పూజకు కావాల్సిన సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం. వినాయకుడి పూజకు పసుపు , కుంకుమ , కర్పూరం , అగరబత్తి , అరటి పండ్లు , మామిడి ఆకులు , పత్రి , దారం , పాలు , పెరుగు , తేనె , నెయ్యి , పంచదార , నూనె , దీపారాధనకు వత్తులు , తమలపాకులు , పువ్వులు , కొబ్బరికాయ , అక్షితలు , కలశం కోసం చెంబు , 21 రకాల పత్రి అవసరం ఉంటుంది. ఇలా వినాయక చవితి రోజు వినాయకుని పూజించడానికి ఈ వస్తువులు అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: