కరోనా వైరస్ పంజా అన్ని రంగాలపై పడుతోంది. ఇప్పటికే దేశమంతా విద్యాసంస్థలు మూసుకుపోయాయి. గతంలో లాగే ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ తరగతులు జరుగుతూ ఉన్నాయి. దేశమంతా కరోనా ప్రళయం సృష్టిస్తోంది. దేవుడి మానవజాతిపై కక్ష గట్టాడా అన్న చందంలో మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కి ఆదేశించింది.