ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిషెల్ స్టార్క్‌ కు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఇంతక ముందు గాయం కార‌ణంగా IPL - 2018 సీజన్ కు దూర‌మైన క్ర‌మంలో త‌న‌కు రావాల్సిన పారితోషికం కోసం గ‌తంలో స్టార్క్ కేసు వేశాడు. అయితే స్టార్క్‌ కు కలిగిన గాయం హ‌ఠాత్తుగా జరగలేదని అతని ప్ర‌త్య‌ర్థి లాయ‌ర్లు కోర్టులో వినిపించారు. దీనితో స్టార్క్‌కు ద‌క్కాల్సిన  మొత్తంగా దక్కాలిసిన రూ.11 కోట్ల 31 ల‌క్ష‌లు పారితోషికం ఇక రాకపోవచ్చు. IPL 2018 సిరీస్ లో గాయం కార‌ణంగా స్టార్క్ ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఆ సంవ‌త్సరానికి గాను అత‌ను KKR యాజమాన్యం తీసుకుంది.

 

 

 

అయితే ఐపీఎల్ ముగిశాక స్టార్క్‌ ను KKR యాజమాన్యం రిలీజ్ చేసింది. దీనితో 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఉండ‌టంతో ఐపీఎల్‌ కు మిచెల్ స్టార్క్ ఆడ‌లేదు. దింతో గ‌త డిసెంబ‌ర్‌ లో జ‌రిగిన వేలంలోనూ స్టార్క్‌ తన పేరును న‌మోదు చేసుకోలేదు. కాకపోతే 2018 ఐపీఎల్‌కు సంబంధించి బ‌కాయిలు ఇప్పించాల‌ని పేర్కొంటూ, ఆస్ట్రేలియాలోని విక్టోరియా కోర్టులో అక్కడ కేసు దాఖలు చేశాడు. ఇందుకు గాను "లాయిడ్స్ ఆఫ్ లండ‌న్" అనే ఇన్సురెన్స్ సంస్థని ప్ర‌తివాదిగా పేర్కొన్నాడు.

 

 


కాకపోతే పూర్తి కేసుని విచారించిన అనంతరం ఉద్దేశ పూర్వకంగా స్టార్క్ ఐపీఎల్‌ కు దూర‌మ‌య్యాడ‌ని, అత‌నికి అయిన గాయం స‌డెన్‌ గా కాలేద‌ని లాయ‌ర్లు అందులో పేర్కొన్నారు. దీనితో అత‌నికి న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వారు గట్టిగా వాదించారు. ఈ దెబ్బతో స్టార్క్‌ కి వచ్చే విధంగా లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: