
అయితే క్రికెట్ చూస్తున్న ప్రేక్షకుల లోనే ఇంత టెన్షన్ ఉంటే.. ఇక అటు నేరుగా మైదానంలో ఆడే క్రికెట్ ఆటగాళ్లకు ఇంకెంత టెన్షన్ ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు తమ లోని టెన్షను పోగొట్టుకోవడానికి సహచరులతో సరదాగా గడుపుతుంటారు. అయితే ఇక ఇటీవలే మయాంక్ అగర్వాల్.. ఇషాంత్ శర్మ చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో జరిగిన ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన ఒక వీడియోను ఐసిసి ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆటగాళ్లంతా ఎంతో సందడిగా కనిపించారు.
ఈ క్రమంలోనే ఇక టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ ఫోటో షూట్ లో ఫోటోలు దిగుతున్న సమయంలో.. పక్కనే ఉన్న మయాంక్ అగర్వాల్ నవ్వాడు. ఇక ఇది గమనించిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ ఫోటో దిగుతున్నప్పుడు ప్రేమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అంతటితో ఊరుకుంటాడా.. మయాంక్ అగర్వాల్ జుట్టుని నిమరడం మొదలుపెట్టాడు. ఇక అప్పుడు మయాంక్ అగర్వాల్ మరింత బిగ్గరగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . ఇక ఇది అటు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.