ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటి అందర్నీ ఆశ్చర్య పరచడమే కాదు క్రికెట్ లో యువ సూపర్ స్టార్ గా మారిపోయారు. ఇక గత ఏడాది ఐపీఎల్ సీజన్ యువ బౌలర్ నటరాజన్ తన యార్కర్ బంతులతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక బౌలర్గా మారిపోయి జట్టు విజయంలో ముఖ్యపాత్ర వహించాడు. ఐపీఎల్లో బాగా రాణించిన నటరాజన్ కు ఆ తర్వాత వరుసగా టీమిండియాలో 3 ఫార్మాట్లలో కూడా చోటు దక్కడం గమనార్హం. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అదే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొత్త బౌలర్ వెలుగులోకి వచ్చాడు.
ఇటీవలే నటరాజన్ కరోనా వైరస్ బారిన పడటంతో అతని స్థానంలో ఊమ్రాన్ మాలిక్ అనే బౌలర్ ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. ఇక ఇటీవల అరంగేట్రం మ్యాచ్లోనే ఉమ్రాన్ మాలిక్ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. తన బౌలింగ్ స్పీడ్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ లో రెండో అత్యంత వేగవంతమైన బాల్ విసిరాడు ఉమ్రాన్ మాలిక్. నిన్న కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో మాలిక్ గంటకు 151.03 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటివరకు కోల్కతా బౌలర్ పెర్గ్యూసన్ గంటకు 152.75 కిలోమీటర్ల వేగమే ఐపీఎల్ లో టాప్ లో కొనసాగుతోంది. ఇక మొన్నటివరకు రెండవ స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ఉండేవాడు 145.97 కిలోమీటర్ల వేగంతో గతంలో మహమ్మద్ సిరాజ్ బంతులు విసిరి రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సన్రైజర్స్ బౌలర్ అరంగేట్రం మ్యాచ్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి