ప్రస్తుతం టీమిండియా జట్టు లో అద్భుతంగా రాణిస్తున్న మహమ్మద్ సిరాజ్ సైతం ఇలా ఐపీఎల్లో అద్భుతంగా రాణించి ఏకంగా అంతర్జాతీయ భారత జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ఐపీఎల్ లో మరో తెలుగోడు మెరిశాడు. తెలుగు ప్రజలందరి గౌరవాన్ని నిలబెట్టాడు. ఇటీవలె రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారు అన్నది ప్రేక్షకులకు ఉత్కంఠ గానే మారిపోయింది.
అయితే ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో తెలుగు ఆటగాడు మెరిసాడు. ఎంతో ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించి అద్భుతంగా రాణించి సూపర్ స్టార్ గా మారిపోయాడు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ ఏకంగా 52 బంతుల్లో 78 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరికి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలోని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి