ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయి ఒక విజయాన్ని సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా లేదంటే వరుస విజయాలతో తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్న గుజరాత్ గెలుస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో కళ్ళార్పకుండా వీక్షించారు ప్రేక్షకులు. ఇది ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయాన్ని సాధించి రెండో విజయాన్ని నమోదు చేసింది.



 అయితే ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ రాహుల్ త్రిపాటి  కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ప్రేక్షకులందరిని  కూడా ఆశ్చర్యపరిచాడు. గత రెండు మ్యాచ్ లలో 84, 96 పరుగులతో అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ జట్టు ఓపెనర్ శుబ్ మాన్ గిల్ ను కేవలం ఏడు పరుగుల వద్ద ఒక అద్భుతమైన క్యాచ్  అందుకున్న రాహుల్ త్రిపాటి అతని పెవిలియన్  పంపించడంలో విజయం సాధించాడు.  జాన్సన్ బౌలింగ్ లు కవర్స్ వైపు మంచి షాట్ ఆడాడు గిల్. అయితే అక్కడే ఫీల్డింగ్  చేస్తున్నాడు రాహుల్ త్రిపాఠి. తన పక్కనే గ్యాప్లో పడబోతున్న బంతి విషయంలో ఎంతో వేగంగా స్పందించాడు.


 నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగిరిన రాహుల్ త్రిపాటి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో అతడు అద్భుతంగా క్యాచ్ పట్టిన తీరు చూసి ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. అయితే గిల్ ఆడిన బంతి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సమయంలో కూడా అద్భుతమైన డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు రాహుల్ త్రిపాఠి. దీంతో గుజరాతి టైటాన్స్ జట్టు 24 పరుగుల వద్ద కీలక వికెట్ను కోల్పోయింది.  కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: