ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు  క్రికెట్ హవా ఎంతలా నడుస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ మొదలవక ముందు వరకు ప్రతి ఒక్కరు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక మ్యాచ్ మొదలయింది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇలా ఐపీఎల్ జరిగినన్ని రోజులు ఎక్కడ చూసినా క్రికెట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే గత రెండేళ్ల నుంచి కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులకు స్టేడియం లోకి అనుమతి లేదు. కానీ ఈ సారి మాత్రం బీసీసీఐ ప్రేక్షకులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులు అందరూ తరలి వెళ్తున్నారు.


 అయితే ఇలా స్టేడియంకు వెళ్లిన అభిమానులు అందరూ కూడా కెమెరాల దృష్టిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిత్రవిచిత్రమైన ప్లకార్డులు పట్టుకుని స్టేడియంలో ప్రదర్శిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయ్. ఇక ఈ ప్లకార్డులతో ఏదో ఒకటి రాసి తాము తమ అభిమాన జట్టుకు ఎంత మద్దతు ఇస్తున్నామొ అన్న విషయాలను చెప్పకనే చెబుతుంటారు. ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఇటీవలే ముంబై ఇండియన్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఒక యువతి వింత ప్లకార్డు ప్రదర్శించింది.


 ఈ సాల కప్ నమ్ దే అని ప్రతిసారి ఆర్సిబి అభిమానులు నోట వినిపించే మాట. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తో ఆర్సిబి ఆడిన మ్యాచ్ లో ఒక అమ్మాయి బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచేంత వరకు నేను పెళ్లి చేసుకోను అని రాసి ఉన్న ఒక ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించింది. ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఇది కాస్త భారత మాజీ ప్లేయర్ అమిత్ మిశ్రా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆమె తల్లిదండ్రుల గురించి మనం నిజంగా బాధపడాల్సిందే అంటూ ఒక కామెంట్ చేశాడు. ఇక ఇది చూసిన తర్వాత అందరూ తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. అంతే కాకుండా దీనిపై భిన్న మైన కామెంట్లు కూడా చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl