ఎప్పటిలాగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు తెరమీదికి వచ్చి తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. చిన్న అవకాశం వచ్చినా తమని తాము నిరూపించుకోవడానికి 100% ఎఫెర్ట్ పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి కోల్కతా జట్టులో కొనసాగుతున్న  రింకు సింగ్ సరైన అవకాశాలు రావడంతో ఎప్పుడూ తెరమీదకి రాలేదు.  ఇటీవలే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కీలకమైన సమయంలో 23 బంతుల్లో 42 పరుగులు చేసి కోల్కతా జట్టు తిరుగులేని విజయాన్ని అందించాడు.


 ఇప్పటివరకు ఎన్నో మ్యాచ్లలో బెంచ్ కే పరిమితమైన రింకు సింగ్ ఇటీవల వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఇక మాజీ క్రికెటర్లు అందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇక ఒక్కసారిగా అతని ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోవడం తో అసలు ఎవరు ఈ రింకు సింగ్ అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు ఇరవై నాలుగేళ్ల రింకు సింగ్. రింకు సింగ్ తండ్రి డోర్ టు డోర్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  ఇక అతని సోదరుడు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే రింకు సింగ్ కూడా ఒకానొక సమయంలో స్వీపర్ గా కూడా పనిచేసాడు. ఎన్నో సార్లు సోదరుడి ఆటో కూడా నడిపాడు.


 కుటుంబ సమస్యల నేపథ్యంలో రింకు సింగ్ పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసాడు. అంతే కాదు రెండు గదులు ఉన్న ఒక ఇంట్లో  9 మంది కుటుంబసభ్యులతో కలిసి నివాసముండేవారు. 2018 ఐపీఎల్ వేలం లో రింకు సింగ్ 80 లక్షల కోల్కతా కొనుగోలు చేసింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ తన జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇక 2018 వేలంలో సెలెక్ట్ అయిన  తర్వాత మాట్లాడిన రింకు తనకు 20 లక్షలు వస్తాయి అనుకున్నాను. కానీ 80 లక్షలకు కొనుగోలు చేశారు. నా తమ్ముడు నా చెల్లెలికి పెళ్లి కి డబ్బులు ఖర్చు పెడుతాను అంటు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకు సింగ్ 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 2307 పరుగులు, 40 లిస్ట్ ఏ మ్యాచులు,  64 టి20 మ్యాచ్ లు ఆడాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం 2018 నుంచి ఇప్పటివరకు కేవలం 13 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు రింకు సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: