డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఎప్పుడూ ఓపెనర్గా అదరగొట్టే డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి కూడా ఓపెనర్ గా మంచి ఆరంభాలు ఇస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. ఇటీవల ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ఎంతో కీలకమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో తలబడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.


 ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. భారీగా పరుగులు చేస్తాడు అనుకుంటే ఒక్క పరుగు కూడా చేయకుండానే మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగారు. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. జట్టు సమస్యల్లో ఉన్నప్పుడు పరిస్థితులను అర్థం చేసుకొని ఆచితూచి ఆడే డేవిడ్ వార్నర్ గోల్డెన్ డక్ ఔట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


 అయితే గోల్డెన్ డకౌట్ అవ్వడాన్ని అటు డేవిడ్ వార్నర్ చేజేతులారా చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ఇటీవల మ్యాచ్ లో  ఢిల్లీ ఇన్నింగ్స్ సమయంలో డేవిడ్ వార్నర్ కి జోడీగా సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. అయితే సర్ఫరాజ్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ వైపు వెళ్తే  డేవిడ్ వార్నర్ మరో ఎండ్ లో ఉన్నాడు. అయితే పంజాబ్ కెప్టెన్ అగర్వాల్ లివింగ్ స్టోన్ కి బౌలింగ్ వేసేందుకు బంతి ఇవ్వగానే వెంటనే తన ఎండ్ ను మార్చుకుని మొదటి బంతిని ఎదుర్కొనేందుకు నిర్ణయించుకున్నాడు డేవిడ్ వార్నర్. చివరికి దురదృష్టవశాత్తు తొలి బంతికే వికెట్ కోల్పోయాడు. దీంతో ఈ విషయం తెలిసి వార్నర్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl