రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అటు ఆన్ ఫీల్డ్ లో ఎంత అగ్రేసీవ్ గా ఉంటాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అస్సలు సహించడు. అంతేకాదు ప్రత్యర్థి ఆటగాళ్లతో ఎప్పుడు వివాదాలు కూడా పెట్టు కుంటూ ఉంటాడు. అయితే ఆన్ ఫీల్డ్ లో ఇంత అగ్రసీవ్ గా ఉండే విరాట్ కోహ్లీ.. ఆఫ్ ఫీల్డ్ లో  మాత్రం ఎంతో సరదాగా కనిపిస్తూ ఉంటాడు. సహచర  ఆటగాళ్లను ఆటపట్టిస్తూ జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ లోని రెండు షేడ్స్ కూడా అటు ప్రేక్షకులందరికీ కూడా ఎంతో నచ్చేస్తాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఇటీవల కోహ్లీ కి సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండడంతో ఇది చూసిన అభిమానులు అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇటీవలి లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా ప్రాక్టీస్ సెషన్ కు రెడీ అవడానికి ముందు విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే గార్డ్ పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో కెమెరా యాంగిల్ కోహ్లీ వైపు తిరిగింది. దీంతో కోహ్లీ సరదాగా కెమెరా తో మాట్లాడాడు. నేను గార్డును పెట్టుకోవాలి కాస్త కెమెరా అటు వైపు తిప్పు అంటూ సైగ చేసాడు.


 అయితే విరాట్ కోహ్లీ మాటలను ఏమీ పట్టించుకోని కెమెరామెన్ కోహ్లీ వైఫై కెమెరా  ఫోకస్ చేశాడు. దీంతో ఇవేవీ పట్టించుకోకుండా విరాట్ కోహ్లీ తన షర్ట్ లేపి గార్డ్  పెట్టుకున్నాడు  మరోసారి కెమెరా వైపు చూశాడు విరాట్ కోహ్లీ. కెమెరా ఫోకస్ తనవైపే  ఉన్నట్లు కనిపించింది. నీ ఫోకస్ తగలెయ్య కాస్త ప్రైవసీ ఇవ్వు అన్నట్లుగా కోహ్లీ కెమెరావైపు సీరియస్ లుక్ ఇచ్చాడు. కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.  ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: