1993లో సరిగ్గా ఇదే రోజు క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కారణం స్పిన్ దిగ్గజం షేన్వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ చూసి ఆశ్చర్యంలో మునిగిపోయింది ఈరోజే. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన ఫోటోని తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అయితే షేన్వార్న్ వేసిన ఆ బంతి ఎలా సాధ్యమైంది అన్నది ఇప్పటికీ కూడా ఎంతోమంది ప్రేక్షకులకు తెలియని ప్రశ్న అని చెప్పాలి.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ లో పర్యటించింది ఆస్ట్రేలియా జట్టు. ఈ క్రమంలోనే మాంచెస్టర్ లోని ఏమిరేట్స్ వేదికగా జూన్ మూడవ తేదీన తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 289 పరుగులు చేసి ఆలౌట్ కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఇక ఓపెనర్ గా ఉన్న గ్రహం గుచ్ 65 పరుగులతో జోరు కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో  అతని చెవి లేని పంపాడు షేన్వార్న్ ఆ తర్వాత మైక్ గాటింగ్ కు అద్భుతమైన బంతి సంధించి పెవిలియన్కు పంపడం  అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 అద్భుతమైన బంతిని సంధించిన షేన్ వార్న్ బ్యాట్స్మెన్ను  బోల్తా కొట్టించాడు అని చెప్పాలి. నేరుగా బండి కాళ్ళ ముందు వేసి ఇక ఆఫ్ వికెట్లు పడగొట్టాడు. అసలు బంతి ఎక్కడ వేస్తున్నాడు అంచనావేసే లోపే ఇక వికెట్ పడిపోయింది.. దీంతో గాటింగ్ సహా అంపైర్లు కూడా  ఒక్కసారిగా బిక్కమొహం వేసి కన్ఫ్యూషన్ లో పడిపోయారు. అప్పుడే దీనిని బాల్ ఆఫ్ ది సెంచరీ గా పేర్కొంటూ వార్నర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్లో మొత్తంగా 8 వికెట్లు పడగొట్టాడు షేన్వార్న్. ఇప్పుడు క్రికెట్ ప్రేక్షకులందరూ షేన్ వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ని గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: