సాధారణంగా క్రికెట్ లో ఒక్కో బౌలర్ ఒక్కో రీతిలో బౌలింగ్ శైలిని కలిగి ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది బౌలర్లు అయితే తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలి తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే కొన్ని కొన్ని సార్లు బౌలర్ల బౌలింగ్ అంతగా క్లిక్ అవ్వకపోయినా అప్పటికీ వారి బౌలింగ్ యాక్షన్ మాత్రం బాగా క్లిక్ అయిపోతూ ఉంటుంది. శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ.. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలాంటి ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక బౌలర్ తన దైన బౌలింగ్ యాక్షన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.


 అంతేకాదు అతను బౌలింగ్ చేస్తున్న విధానం చూస్తే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమా గుర్తుకు వస్తుంది అని చెప్పాలి. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లగాన్ సినిమా దాదాపు ప్రేక్షకులు అందరికి గుర్తుండే ఉంటుంది  ఇక ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్ళతో అమీర్ ఖాన్ సహా చుట్టుపక్కల వాళ్ళు అందరూ క్రికెట్ మ్యాచ్ ఆడే సన్నివేశం ఎంతో హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ సన్నివేశంలో గోలి అనే పాత్రధారి బౌలింగ్ యాక్షన్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మర్చిపోలేదు అని చెప్పాలి.



 ఎందుకంటే ఇంగ్లీష్ క్రికెటర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గోలి అనే వ్యక్తిని బౌలింగ్ చేయమంటూ  బంతిని అప్పగిస్తాడు అమీర్ ఖాన్. ఇక తన చేతిని గిర్రున తిప్పుతూ వచ్చి బంతి విసురుతూ ఉంటాడు. అయితే బంతి ఎప్పుడు వేస్తున్నాడో కూడా అర్థం కాక బ్యాట్స్మెన్ తికమక పడిపోతూ వుంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా అచ్చం ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. ఓ యువకుడు బంతిని పట్టుకొని తన చేతిని గిరగిరా తిప్పుతూ బౌలింగ్ చేశాడు. ఇక అతను వేస్తున్న బంతిని ఎలా ఆడాలో తెలియక చివరికి బ్యాట్స్మెన్ విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఈ వీడియో  వైరల్ గా మారి పోవడం తో ఇది చూసి అమీర్ ఖాన్ సినిమా ను గుర్తు చేసుకుంటున్నారు అందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: