ఐర్లాండ్ జట్టు ఇప్పుడిప్పుడే అటు ప్రపంచ క్రికెట్లో గుర్తింపు సంపాదించుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే పలువురు సీనియర్ ఆటగాళ్లు వరుసగా తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం మాత్రం హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది అని చెప్పాలి. ఇటీవలే ఐర్లాండ్ క్రికెట్ లో దిగ్గజంగా కొనసాగుతున్న ఒక క్రికెటర్ అభిమానులందరికీ రిటైర్మెంట్ ప్రకటన చేసి షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ విలియం పోర్టల్ ఫీల్డ్ ఇక ఇటీవలే తన రిటైర్మెంట్ ని సోషల్ మీడియాలో తెలిపాడు.


 అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన నాటి నుంచీ కూడా విలియం పోర్టల్ ఫీల్డ్ కీలక పాత్ర ఐర్లాండ్ జట్టుకు గుర్తింపు తీసుకురావడం లో జట్టు పటిష్టంగా మార్చడంలో కీలకపాత్ర పోషించాడు అనే చెప్పాలి. జట్టు విజయాల్లో మూలస్తంభంగా నిలిచిన ఎన్నో సార్లు మంచి విషయాలను కూడా అందించాడు. అలాంటి పోర్టల్ ఫీల్డ్ ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్  ప్రకటించడంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయాడు అని చెప్పాలి. ఇకపోతే పోర్టల్ ఫీల్డ్ 148 వన్డేల్లో 11 సెంచరీలు.. మొత్తంగా 4343 పరుగులు చేశాడు.


 2007లో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై గెలుపు, 2009లో టి20 వరల్డ్ కప్ క్వాలిఫై, 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై సంచలన విజయాలలో ఈ సీనియర్ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఐర్లాండ్  జట్టుకు తొలి కెప్టెన్గా వ్యవహరించిన ఘనత ఇతనికే కూడా సొంతం అయ్యింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు ఒక ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు జట్టు కోచ్ గా మాత్రం తాను తన సహకారాన్ని అందిస్తాను అంటూ స్పష్టం చేశాడు. ఈక్రమంలోనే క్రికెట్ ఐర్లాండ్ పోర్టల్ ఫీల్డ్ తో ఉన్న తన అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: