సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటగాళ్ల జీవితం మొత్తం మారిపోతుందని అందరూ అనుకుంటారు. కోట్ల రూపాయల సంపాదనతో అప్పటివరకూ సాదాసీదా జీవితం గడిపిన వారు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఇది విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అతను క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు పోటీగా పరుగులు చేశాడు   సెంచరీల మీద సెంచరీలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.


 కానీ ఇప్పుడు మాత్రం దీనస్థితిని  ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఆ క్రికెటర్ ఎవరో కాదు 90వ దశకంలో క్రికెట్ అభిమానులను అలరించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వినోద్ కాంబ్లీ. అయితే క్రికెట్లో రాణించాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా ఉండాలి. కానీ ఆ విషయంలో వినోద్ కాంబ్లీ తప్పటడుగులు వేశాడు. అప్పుడు భారీ పరుగులతో సచిన్ను మించిపోయేలా కనిపించిన అతను క్రమశిక్షణ లేమితో తాగుడుకు బానిస గా మారి పోయి ఫామ్ కోల్పోయాడు. వెరసి జట్టుకు దూరమయ్యాడు అనే చెప్పాలి. తర్వాత ఎన్నో సార్లు అవకాశాలు దక్కించుకున్నప్పటికి కూడా తన మునుపటి ఫామ్ మాత్రం అందుకోలేకపోయాడు.


 ఆ తర్వాత కూడా వృత్తి,వ్యక్తిగత జీవితంలో కూడా నిత్యం ఏదో ఒక వివాదంతో వినోద్ కాంబ్లీ   వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు దీన స్థితిలో బ్రతుకుతున్నాడు అనేది తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయి పూటగడవని పరిస్థితిలో వినోద్  ఉన్నాడట. ఈ క్రమంలోనే క్రికెట్ కు సంబంధించి ఏదైనా పని ఇవ్వాలని బీసీసీఐ ని దీనంగా వేడుకుంటున్నాడు అని తెలుస్తోంది. బీసీసీఐ ఇస్తున్న 30 వేల పెన్షన్ తనకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తనకు ఎదయినా పని ఇప్పించమని అంటూ అభ్యర్థించడం గమనార్హం. అయితే తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ ఇప్పటికే ఎన్నో సార్లు తన వంతు సహాయం చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: