అంతా మనం అనుకున్నట్టే జరిగితే మనం మనుషులం ఎందుకు అవుతావు. కాలం  ఎలా నడిపిస్తే మనుషులు అలా నడుస్తూ ఉంటారు. కానీ అందరూ అనుకునేది కేవలం మనం అనుకున్నట్లుగా మాత్రమే  మన జీవితం సాగిపోతోంది అని. అయితే ఎవరెన్ని అనుకున్న ప్రతి ఒక్కరినీ కాలం ప్రతిక్షణం ఊహించని రీతిలో పరీక్షలు పెడుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కనుక ఒక సమయంలో తమకు అనుకూలంగా ఉంది అనుకున్న విషయమే మరో సమయంలో మాత్రం చివరికి రివర్స్ గా మారిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు క్రికెటర్ల విషయంలో ఇలానే జరుగుతూ ఉంటుంది.


 ఇటీవల ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో విషయంలో కూడా ఇదే జరిగింది అని తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి బెయిర్ స్టో టెస్టులలో ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో నెమ్మదిగా ఆడాల్సిన సుదీర్ఘమైన ఫార్మాట్లో టీ20ల్లో లాగా మెరుపు అదరగొడుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో, భారత్ తో  జరిగిన టెస్టు సిరీస్లో ఎంత చెలరేగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలర్ల పై  వీర విహారం చేస్తూ వరుస సెంచరీలతో కదంతొక్కాడు బెయిర్ స్టో.


 ఇలాంటి సమయంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని అతని విషయంలో నిరూపితమైంది. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీల వీరుడు బెయిర్ స్టో డకౌట్ గా వెనుదిరిగాడు. సౌత్ ఆఫ్రికా పేసర్ ఆన్ రిచ్ నోర్జె వేసిన బంతి కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏకంగా గుడ్ లెంత్ తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్ ను గిరాటేసింది. వికెట్ మొత్తం బయటికి ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే మొన్నటి వరకు భారీగా పరుగులు చేసి సెంచరీలతో చెలరేగిన బెయిర్ స్టో ఇలా డకౌట్ గా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. అభిమానులు కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: