అయితే భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రతీకారం అయితే తీర్చుకుంది గానీ విజయానందంలో వున్న టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. కేవలం టీమిండియాకు మాత్రమే కాదండోయ్ అటు ఓడిపోయిన పాకిస్తాన్ కు కూడా ఐసిసి షాక్ ఇవ్వడం గమనార్హం. ఈ మేరకు ఐసిసి ఇటీవలే ఒక కీలక ప్రకటన విడుదల చేసింది అని చెప్పాలి. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకు కూడా జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇరు జట్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా మ్యాచ్ జరిగితే స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్ లకు బదులు కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. అయితే మ్యాచ్ లో ఇరు జట్ల కోట సమయాన్ని గంటన్నర దాటి అరగంట ఇన్నింగ్స్ పొడిగించారు. దీంతో అరగంట సమయంలో ఇరు జట్లు ఫీల్డింగ్ లో నిబంధనల మధ్య బరిలోకి నిలిచాయి అని చెప్పాలి. ఏదేమైనా అటు గెలిచిన జట్టుకు ఇటు ఓడిన జట్టుకు కూడా ఐసీసీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి