ఆసియా కప్ లో సూపర్ ఫోర్ కు చేరుకునే జట్ల పైన ఒక అంచనాకు రావాలంటే ఈ రోజు జరిగే మ్యాచ్ పై ఆధాపరపడి ఉంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుండి ఇండియా మరియు గ్రూప్ బి నుండి ఆఫ్గనిస్తాన్ లు అధికారికంగా సూపర్ ఫోర్ కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నిరీక్షణ ఉంది. అయితే గ్రూప్ బి లో జరగబోయే ఈ రోజు సాయంత్రం మ్యాచ్ తో మరో జట్టు సూపర్ ఫోర్ కు అర్హత సాధిస్తుంది. గ్రూప్ బి లో మూడు జట్లలో పసికూన ఆఫ్ఘనిస్తాన్ తనకన్నా బలమైన శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లను ఓడించి మిగిలిన జట్లకు సవాలు గా నిలిచింది.

ఇప్పుడు ఆసియా కప్ ను గెలవడానికి ఇండియా మరియు పాకిస్తాన్ లతో పాటుగా ఆఫ్గనిస్తాన్ కూడా బరిలో ఉన్నట్లే లెక్క. కానీ పాకిస్తాన్ కనుక ఇండియా తో ఆడినట్లే ఆడితే ఫైనల్ కు ఇండియా తో పాటు ఆఫ్ఘన్ తప్పక చేరుతుంది.

సాయంత్రం బంగ్లాదేశ్ శ్రీలంక ల మధ్యన మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు సూపర్ ఫోర్ కు అర్హత సాధిస్తారు అన్న విషయం తెలిసిందే.. అందుకే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. కాకపోతే ఈ మ్యాచ్ లో ఎవరు ఫేవరెట్ అన్నది చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే... ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘన్ చేతిలో ఓడడంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింది అని చెప్పాలి.

కాగా శ్రీలంక లో కీలక ఆటగాళ్లు విఫలం కావడం ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో ఓటమికి ప్రధాన కారణం. కాబట్టి ఆ లోటును ఈ మ్యాచ్ లో అధిగమించుకుని విజయం సాధించాలని బరిలోకి దిగుతున్నారు.

ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే, షకీబ్ సారధ్యంలో బంగ్లా లాస్ట్ అయిదు ఓవర్ ల వరకు మ్యాచ్ లో ఉన్నప్పటికీ... నజీబుల్లా జాడ్రన్ రెచ్చిపోవడంతో ఓటమి ఖరారు అయింది. అందుకే ఈమ్యాచ్ లో ఆ అవకాశం ఇవ్వకుండా విజయం లక్ష్యంగా బంగ్లా పులులు రంగంలోకి దిగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: