గత రెండు సీజన్ లుగా వరల్డ్ క్రికెట్ లో ఉన్న లెజెండ్స్ అందరూ కలిసి ఆడుతున్న సిరీస్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్... ఇందులో భాగంగా గత మూడు వారాల నుండి నిర్విరామంగా జరుగుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన లెజెండ్ జట్లు పోటీ పడ్డాయి. అందులో ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ మరియు ఇంగ్లాండ్ లు ఉన్నాయి. ఇందులో గ్రూప్ దశలో ఒక్కో టీం అయిదు మ్యాచ్ లను ఆడింది. అందులో ఉత్తమ ప్రదర్శన చేసి టాప్ 4 లో నిలిచిన జట్లు నాక్ అవుట్ కు చేరుకున్నాయి. వారిలో ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ , శ్రీలంక లెజెండ్స్ మరియు వెస్ట్ ఇండీస్ లెజెండ్స్ ఉన్నారు.

నిన్న పూర్తి అయిన మొదటి సెమీఫైనల్ లో ఇండియా ఆస్ట్రేలియా ను ఢీకొట్టి గెలిచి ఫైనల్ కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అయితే ఆస్ట్రేలియాకు ఉన్న బౌలింగ్ అటాక్ కు ఈ స్కోర్ ను  కాపాడుకోవడం సులభమే. కానీ ఇండియా బ్యాటింగ్ ముందు ఆస్ట్రేలియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇండియా లెజెండ్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి గర్వంగా ఫైనల్ కు చేరుకున్నారు. రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది, కాగా ఈ రోజు జరగబోయే రెండవ సెమీఫైనల్ లో గెలిచిన జట్టు రేపు ఇండియాతో తలపడనుంది.

ఈ రోజు సాయంత్రం శ్రీలంక మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. మరి ఎవరు గెలిచి ఫైనల్ లో ఇండియా తో తలపడుతారో చూడాలి. అయితే ఫామ్ ను బట్టి చూస్తే శ్రీలంక దుర్బేధ్యమైన ఫామ్ లో ఉంది. ముఖ్యంగా జయసూర్య, దిల్షాన్, తరంగ లు అదరగొడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: