టి20 ప్రపంచ కప్ కి ముందు అటు టీమిండియా విషయంలో అందరూ భయపడుతున్నదే జరిగింది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక బౌలర్గా.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాగా రానించి జట్టుకు విజయాన్ని అందించే ఆటగాడిగా కొనసాగుతున్న జస్ ప్రీత్ బూమ్రా చివరికి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కి కూడా అతను భారత జట్టుకు అందుబాటులో ఉండడం లేదు అన్నది తెలుస్తోంది. అయితే గాయం కారణంగా గత కొంతకాలం నుంచి జట్టుకు బుమ్రా దూరమయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


 కానీ అటు బీసీసీఐ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బుమ్రా గాయం గురించి స్పందించిన కోచ్ రాహుల్ ద్రవిడ్ బుమ్రా కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అన్న విధంగానే మాట్లాడాడు. దీంతో ప్రతి ఒక్కరిలో కూడా ఆశలు పుట్టుకొచ్చాయి అని చెప్పాలి. కానీ అందరూ భయపడుతున్నట్లుగానే చివరికి బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం ఇటీవల బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి.


 దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇక గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరమైన బుమ్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.. నేను ఈసారి టి20 ప్రపంచ కప్ లో భాగం కాలేను అని తెలిసినప్పుడు ధైర్యంగానే ఉన్నాను. నేను తొందరగా కోలుకోవాలని నాపై ప్రేమ చూపిస్తూ కోరుకున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్న.. నేను జట్టులో లేకపోతే ఏంటి ఆస్ట్రేలియా వెళ్తాను. అక్కడ టీమ్ ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ కి కూడా నా మద్దతు ప్రకటిస్తాను.. చీర్స్ చెబుతూ టీమిండియాని ఉత్సాహపరూస్తాను అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: