దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ఎందరో స్నేహితులు కొందరు శత్రువులు అందరికీ వందనాలు అని ప్రారంభించాడు. అమెరికా అభివృద్ధి జరిగితే ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుందని ట్రంప్ కొత్త దృక్పథాన్ని వెల్లడించాడు. అమెరికా ఆర్థిక ఇంజిన్‌గా నిలిచి ప్రపంచ దేశాలను ముందుకు నడిపిస్తోందని ఆయన పేర్కొన్నాడు. తన పాలనలో అమెరికా ప్రజలు సంతోషంగా ఉన్నారని ట్రంప్ గర్వంగా చెప్పాడు.

అమెరికా ఆర్థిక వృద్ధి గణనీయ స్థాయికి చేరుకుందని ఆయన వివరించాడు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించామని ట్రంప్ ప్రకటించాడు. అమెరికాలో చాలా వస్తువులు సేవలపై పన్నులు తొలగించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పాడు. ప్రపంచ దేశాలు అమెరికా మార్గాన్ని అనుసరిస్తున్నాయని ట్రంప్ వాదించాడు.ఆర్థిక అభివృద్ధి కోసమే వివిధ దేశాలపై సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ సమర్థించుకున్నాడు.

అమెరికా ఆర్థిక విజయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నాడు. తన పాలనలో అమెరికా అభివృద్ధి పథంలో సాగుతోందని ట్రంప్ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. అమెరికా ఆర్థిక శక్తిగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని ఆయన హైలైట్ చేశాడు. ఈ విజయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తున్నాయని ట్రంప్ విశ్వసిస్తున్నాడు. అమెరికా అభివృద్ధి ద్వారా ప్రపంచ దేశాలు కూడా లాభపడుతున్నాయని ఆయన వాదన.

దావోస్ సదస్సులో ట్రంప్ మాటలు ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాయి. ఆయన దృక్పథం అమెరికా కేంద్రీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది.ఐరోపా దేశాలు సరైన మార్గంలో సాగడం లేదని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు. ఐరోపాలో వలసలపై నియంత్రణ లేకపోవడం సమస్యలకు దారితీస్తోందని ఆయన అన్నాడు. ఐరోపా దేశాల్లో అప్పులు పెరిగిపోతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. కొన్ని ఐరోపా దేశాలు పతనం దిశగా వెళ్తున్నాయని ఆయన హెచ్చరించాడు.

9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్యలు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజ‌ల ఇబ్బందులు, అక్కడ అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: