ప్రస్తుతం పాకిస్తాన్ , ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇక తొలి టెస్ట్ లో భాగంగా తొలత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే 75 ఓవర్లలోనే 5006 పరుగులు చేసి ఎన్నో రికార్డులను సృష్టించింది ఇంగ్లాండ్ జట్టు. ఇక 11 ఓవర్లలోనే 657 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో దీటుగానే బదులిచ్చింది అని చెప్పాలి.


 తొలి ఇన్నింగ్స్ లో అటు ఇంగ్లాండ్ ఓపెనర్ల తరహాలోనే పాకిస్తాన్ ఓపెనర్లు కూడా ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోయారు. కెప్టెన్ బాబర్ అజం సైతం సెంచరీ తో కదం తొక్కాడు అని చెప్పాలి. ఇక నిస్సారమైన ఈ పిచ్ పై పరుగుల వరద పారింది అని చెప్పాలి. అయితే జీవం లేని ఈ పిచ్ ను తయారు చేసినందుకుగాను ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో బాబర్  సెంచరీ  చేయడంతో ఇంగ్లాండు మాజీ సారథి మైకల్ వాన్ అతడిని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేస్తాడు. అన్ని ఫార్మాట్లలో మంచి ప్రదర్శన చేసే అద్భుతమైన ఆటగాడు అంటూ కొనియాడాడు.


 అయితే ఇక అతను చేసిన ట్విట్ పై నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబర్ ను ఆల్ ఫార్మాట్ గ్రేటెస్ట్ ప్లేయర్ అనడం విడ్డూరంగా ఉంది అంటూ కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో బాబర్ అత్యుత్తమ ఆటగాడ.. ఈ స్టేట్మెంట్ ని బాబర్ కూడా ఒప్పుకోడేమో.. బెస్ట్ ఇన్నింగ్స్ అంటున్నారు.. ఆ పిచ్  మీద అశ్విన్ బ్యాటింగ్ చేసిన కూడా త్రిబుల్ సెంచరీ కొట్టేవాడు. నాకు బాబర్ అంటే వ్యతిరేకత ఏమీ లేదు. కానీ ఈ సెంచరీ అనేది పెద్ద విషయమేమీ కాదు. అదిగాక మీరన్నట్టు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనేది పెద్ద జోక్ అంటూ ఒక నెటిజన్ ఏకంగా మైకేల్ వాన్ కు కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: