ఇటీవల టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘోర వైఫల్యం చెందిన తర్వాత జట్టులో యువ ఆటగాళ్లను తీసుకొని కెప్టెన్ ని కూడా మారిస్తే బాగుంటుందని చర్చ తెర మీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హార్థిక్ పాండ్యాని కెప్టెన్ గా మారిస్తే బాగుంటుంది అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ఆటగాళ్లు సైతం హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేస్తే బాగుంటుంది చర్చపై ఏకీభవించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రోహిత్ శర్మను తప్పించి ఇక హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని చర్చ తీవ్రమైంది.


 ఇకపోతే ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా  టి20 సిరీస్ కైవసం చేసుకుంది. కాగా అతని కెప్టెన్సీ పై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. అయితే ఇక ఇటీవల హార్థిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్ గా మారితే ఎలా ఉంటుంది అన్న విషయంపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్థిక్ పాండ్యలో టీమిండియాని నడిపించగల నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. నేను హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడాను.


 హార్థిక్ పాండ్యాలో గొప్ప నాయకత్వ లక్షణాలు నైపుణ్యాలు చూశాను. భారత టి20 లీగ్ సమయం లోనే తనను తాను రుజువు చేసుకున్నాడు హార్థిక్ పాండ్యా. ఇక గుజరాత్ జట్టులో ఆడినప్పుడు అతని కెప్టెన్సీ ని మేము ఎంతగానో ఆస్వాదించాము అంటూ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో కొత్తగా ఐపీఎల్లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా మొదటి సీజన్లోనే తన అద్భుతమైన కెప్టెన్సీ తో జట్టుకు టైటిల్ అందించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యాలో ఎంత గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అని ఎంతో మందికి మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: