ఏకంగా సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ఇక ఇద్దరినీ కూడా బీసీసీఐ తొలగించబోతుంది అన్న ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది అని చెప్పాలి. అయితే ఫామ్ కోల్పోయి గత కొంతకాలం నుంచి ఇక జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నారు ఈ ఇద్దరు క్రికెటర్లు. రహానే చివరిసారిగా భారత్ తరఫున ఆరంభంలో శ్రీలంకపై జరిగిన టెస్ట్ సిరీస్లో ఆడితే ఇషాంత్ శర్మ మాత్రం గత ఏడాది నవంబర్లో న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. కానీ ఎందుకో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. అదే సమయంలో వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్ కు ప్రమోషన్ ఇవ్వబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.
సెంట్రల్ కాంట్రాక్టులో గ్రూప్ సిలో ఉన్న హార్దిక్ సూర్య, గిల్ లను గ్రూపు బి లోకి చేర్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించి డిసెంబర్ 21వ తేదీన జరగబోయే బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం సూర్య కుమార్, హార్దిక్, గిల్ కూడా గ్రూప్ సిలో ఉన్నారు. ఈ ఏడాదిలో వీరు ఇద్దరు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు. వీరిని నేరుగా గ్రూప్ ఏలోకి కాకపోయినా కనీసం గ్రూప్ బి లోకి మార్చాలని బీసీసీఐ యోచిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే గనుక జరిగితే.. గ్రూప్ సి నుంచి గ్రూప్ బి లోకి వచ్చిన ముగ్గురు ప్లేయర్లకు కూడా పారితోషక మూడు కోట్లు అవుతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి