ఈ క్రమంలోనే ఈ రెండు దాయాది దేశాలు తలబడాలి అంటే ఏదైనా ఐసిసి టోర్నీ జరగాల్సిందే. ఐసీసీ టోర్నీ అంటే ద్వైపాక్షిక సిరీస్ ల లాగా ఎప్పుడు పడితే అప్పుడు జరగదు అన్న విషయం తెలిసిందే. అందుకే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ రూపంలో రెండుసార్లు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అదృష్టం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు దక్కింది. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో మేల్ బోర్న్ వేదికగా జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నరాల తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి టీమిండియా విజయం సాధించింది. అయితే ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మేల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ కోసం వేదికను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అన్నట్లుగా ఒక ప్రకటన చేసింది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ సాధ్యమయ్యేలా ఐసీసీ పై క్రికెట్ ఆస్ట్రేలియా ఒత్తిడి చేస్తుందని భావిస్తున్నాము అంటూ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం యాజమాన్యం తెలిపింది. టి20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కలిగిన అనుభూతి ఎప్పుడు అనుభవించలేదని.. మేల్ బోర్న్ గ్రౌండ్ చీప్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ తెలిపారు. ప్రతి బంతికి ప్రేక్షకుల స్పందన మాటల్లో వర్ణించలేనిది అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి