ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ లీగ్ లో భాగంగా సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ బ్రిస్బెన్ హీట్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. బ్రిస్బెన్ హీట్ జట్టు 15 పరుగులు తేడాతో సిడ్నీ సిక్సర్స్ ను చిత్తు చేసింది అని చెప్పాలి. అయితే ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగక మ్యాచ్ మొత్తానికి ఒక క్యాచ్ మాత్రం హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. ఏకంగా అభిమానులు క్రికెట్ నిపుణులను సైతం ఈ సీన్ అయోమయంలో పడేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్లో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాదు క్రికెట్ రూల్స్ అన్నీ తెలిసిన ప్రేక్షకులను కూడా కన్ఫ్యూషన్ లో పడేస్తుంది. ఈ వీడియో మైకేల్ నేజర్ అనే ఆటగాడు పట్టుకున్న అద్భుతమైన క్యాచ్ ఈ వీడియోలో చూడవచ్చు. బ్రిస్బెన్ హీట్ ఆటగాడు మైకేల్ నేజర్ సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్మెన్ జోర్డాన్ సిల్క్ కొట్టిన ఓ బంతిని అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో క్యాచ్ పట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే అతను పట్టుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడానికి ఒక పెద్ద కారణమే ఉంది.


 సాదరణంగా ఇప్పటివరకు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఎంతో చాకచక్యంగా గాల్లోకి ఎగిరి ఎక్కడ తమ బ్యాలెన్స్ కోల్పోకుండా క్యాచ్ పట్టుకోవడం ఇప్పటివరకు ఎన్నో సార్లు చూసాం. కానీ ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం బౌండరీ లైన్ లోపలే క్యాచ్ పట్టినప్పటికీ ఆ తర్వాత బ్యాలెన్స్ చేసుకోలేక బౌండరీ లైన్ అవతలికి వెళ్ళిపోయాడు. ఇక బౌండరీ లైన్ లోపల నుంచి మళ్ళీ గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకుని పెద్ద విన్యాసమే చేశాడు అని చెప్పాలి. ఇక ఈ క్యాచ్కి అటు ఎంపైర్ అవుట్ కూడా ఇవ్వడం గమనార్హం. అయితే ఈ క్యాచ్ క్రికెట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: