ప్రపంచ క్రికెట్లో వికెట్ కీపింగ్ అనే విషయం గురించి ప్రస్తావన వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు ముందుగా చర్చించుకునేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి అని చెప్పాలి. ఎందుకంటే అసమాన్యమైన ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్ లలో ఒకడిగా ఇక మొదటి వరుసలో ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. వికెట్ల వెనకాల ఎంతో వేగంగా కదులుతూ ఏకంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక రెప్పపాటు కాలంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వికెట్ తీయడం అటు ధోనికే సాధ్యమవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు.


 ఇక ధోని వెనకాల కీపింగ్ చేస్తూ ఉన్నాడు అంటే చాలు ఇక క్రీజును దాటాలంటే ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తూ ఉంటారు బ్యాట్స్మెన్లు. ముఖ్యంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మెరుపు వేగంతో వికెట్లను చూడకుండానే వెనక్కి బంతిని విసిరి మెరుపు వేగంతో రనౌట్ చేసే విధానం అయితే ఏకంగా అందరిని మంత్రముగ్దులను చేస్తూ ఉంటుంది. అయితే ధోని లాగా ఎంతో మంది ప్రయత్నించినప్పటికీ విఫలం అయ్యి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇటీవలే మాత్రం ఒక ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని మరిపించాడు.


 ఆ ఆటగాడు ఎవరో కాదు ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ బిల్లింగ్స్. ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న టి20 లీగ్ లో డిసర్ట్ వైపర్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే షార్జా వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన రనౌట్ చేశాడు. పదవ ఓవర్లో బెన్నీ హోలీ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని జో డెన్ని ఆఫ్ సైడ్ డిఫెన్స్  ఆడాడు. అయితే వెంటనే బంతిని అందుకుని వికెట్లను చూడకుండా త్రో చేశాడు బిల్డింగ్స్. దురదృష్టవశాత్తు అప్పటికి ఇంకా క్రీజు బయటే ఉన్నాడు బ్యాట్స్మెన్. దీంతో చివరికి బంతి వికెట్లను గిరాటేయాటంతో వికెట్ దక్కింది అని చెప్పాలి. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: