ప్రస్తుతం టీమిండియా లో ఉన్న ఎంతోమంది బౌలర్ల లో మహమ్మద్ షమి కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో మంది కొత్త బౌలర్లు టీమిండియాలోకి వచ్చినప్పటికీ షమి మాత్రం తన అద్భుతమైన బౌలింగ్ తో ఎప్పుడూ ప్రత్యర్థులను వనికిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా స్వింగ్ అయ్యే బంతులపై అయితే షమి తన బౌలింగ్ వైవిద్యాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇలా వైవిద్యమైన బంతులతో తికమక పెట్టి వికెట్ రాబట్టడంలో అతను దిట్ట అని చెప్పాలి.


 అయితే ఇక ఈ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి ఇక్కడ  భారతి జట్టుతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే  అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇక భారత జట్టులో భాగమైన సీనియర్ బౌలర్ షమి తన బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక ఇటీవల కాలంలో యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా నిరూపించుకుంటున్నాడు మహమ్మద్ షమీ. కాగా అతని పై వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి.


 ప్రస్తుతం టీమిండియా లో అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సైతం మహమ్మద్ షమీ బౌలింగ్ లో ఆడటానికి ఎంతో ఇబ్బంది పడతారు అంటూ దినేష్ కార్తీక్ చెప్పకు వచ్చాడు. నెట్ ప్రాక్టీస్ సమయం లో తన కెరీర్లో తాను ఎదురుకున్న అత్యంత కఠినమైన బౌలర్ షమీ అంటూ చెప్పు కొచ్చాడు. నెట్ ప్రాక్టీస్ లో అతని బౌలింగ్లో ఆడటం టార్చర్ అంటూ తెలిపాడు. ఇక కోహ్లీ రోహిత్ శర్మ సైతం అతని బౌలింగ్ లో ఆడటానికి ఇబ్బంది పడతారు అంటూ మహమ్మద్ షమి ప్రదర్శన పై ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: