గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో కేఎల్ రాహుల్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భారత జట్టులో కీలకమైన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాదాపు గత పది మ్యాచ్ లలో కూడా ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు అని చెప్పాలి. అయితే అతను వరుసగా విఫలం అవుతూ ఉన్నప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతనికి అవకాశాలు ఇస్తూనే వస్తున్నారు. అతని కోసం ఫామ్ లో ఉన్న యువ క్రికెటర్లను సైతం పక్కన పెట్టారు.


 కానీ రోజురోజుకీ కేఎల్ రాహుల్ వైఫల్యం ఎక్కువ అవుతూ ఉండడం జట్టుకు మైనస్ గా మారిపోతుంది. ఈ క్రమంలోనే అతని పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది అని భారత సెలక్టర్లు భావిస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ను ఇప్పటికే వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ కలెక్టర్లు మిగతా రెండు టెస్టులలో కూడా అతనిపై వేటు వేయడం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై భారత సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిపై వేటు పడుతుందన్న విషయం అతనికి కూడా తెలుసు. అయితే ఇది ఒక కేవలం ఒక్క మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా కాదు. దాదాపు గత పది మ్యాచ్ల నుంచి అతని వైఫల్యం కారణంగానే జరుగుతున్న విషయం కూడా అతనికి తెలుసు.



 అతను ఒక వరల్డ్ క్లాసు క్రికెటర్ కానీ ప్రస్తుతం అతని బ్యాటింగ్లో కొన్ని టెక్నికల్ లోపాలు ఉన్నాయి. కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా తిరిగి రావాలి అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఇది ప్రొఫెషనల్ వరల్డ్. ఇక్కడ మధుర జ్ఞాపకాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఓ ఆటగాడిగా ఉన్నప్పుడు అన్నింటికీ సిద్ధపడాలి. నా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి టాయిలెట్లో ఏడ్చాను. అప్పుడు చేసేదేమీ ఉండదు కదా. రాహుల్ విషయంలో ఇదే జరుగుతుంది. ప్రస్తుతం పేలవమైన ఫామ్ తో  సతమతమవుతున్న కేఎల్ రాహుల్ పై మూడవ టెస్ట్ మ్యాచ్లో వేటు వేసి గిల్ ను తుది జట్టులోకి తీసుకుంటారు అని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk