ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎంతోమంది ప్లేయర్లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ  రికార్డులు సృష్టిస్తుంటే.. బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించి ఇక జట్టుకు విజయాలను అందిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా సీజన్లో మెరుగ్గా రాణిస్తున్న బ్యాట్స్మెన్లు ఎంతమంది ఉన్నారో ఇక అంచనాలను అందుకోలేక వరుసగా విఫలం అవుతున్న బ్యాట్స్మెన్లు కూడా అంతే మంది ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో వరుసగా విఫలమవుతూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న క్రికెటర్లకు లిస్టు చూస్తే మొదటి వరుసలో దీపక్ హుడా పేరే వినిపిస్తూ ఉంది. ఇతను ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం భావిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఎంతో నమ్మకం పెట్టి అతనికి తుది జట్టులో ఛాన్స్ కల్పిస్తే నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నాడు. 2022 ఐపిఎల్ సీజన్లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఈ ఏడాది లక్నో జట్టు అతన్ని 5. 75కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది. కానీ అతనికి దక్కిన ధరకి అతను ఎక్కడ న్యాయం చేయలేకపోతున్నాడు. ఎందుకురా బాబు అతన్ని కొనుక్కున్నాం అని చిరాకు వచ్చేలా అతని ప్రదర్శన సాగుతూ ఉంది అని చెప్పాలి.



 ఇప్పటివరకు ఐపీఎల్ లో భాగంగా 6 మ్యాచ్ల్లో ఆడాడు దీపక్ హుడా. డీకాక్ లాంటి స్టార్ ప్లేయర్లను పక్కనపెట్టి మరి అటు దీపక్ హుడాకి ఛాన్స్ ఇస్తుంది జట్టు యాజమాన్యం. అయితే ఆరు మ్యాచ్ లలో 6.5 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు అంటే అతని ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 బంతుల్లో రెండు పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇప్పటివరకు అతని ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు 17 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఇలా జట్టు వరుస విజయాల సాధిస్తున్న దీపక్ హుడా పేలవమైన  ఫామ్ మాత్రం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl