ఇటీవలే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది . అయితే ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. భారీ అంచనాలు పెట్టుకుని కోట్ల రూపాయలు కుమ్మరించి మరి కొనుగోలు చేసిన ఆటగాళ్లు అట్టర్ ఫ్లాప్ అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ ధరతో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ఇలా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కొంత మంది ఆటగాళ్లు అయితే సరైన ప్రదర్శన చేయలేక కేవలం బెంచ్ కే పరిమితం అయ్యారు అని చెప్పాలి. ఇలా ఈ సీజన్లో భారీ అంచనాల మధ్య బలిలోకి దిగి అట్టర్ ఫ్లాప్ అయిన వారిలో అటు ఫెర్గ్యూసన్ కూడా ఉన్నాడు అని చెప్పాలి.



 2023 ఐపీఎల్ సీజన్లో ఈ ఆటగాడు అత్యంత కాస్లి ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2022 వేలంలో ఫెర్గ్యూసన్ 10 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్ జట్టు. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి అతన్ని ట్రేడ్ చేసుకుంది అని చెప్పాలి. అయితే 2023 సీజన్లో మళ్లీ కోల్కతాలోకి వచ్చేసాడు అతడు. కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఫెర్గ్యూసన్.. ఎక్కువ మ్యాచ్ లు  రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు అని చెప్పాలి. కాగా అతని కోసం పది కోట్లు వెచ్చించింది కోల్కతా నైట్ రైడర్స్. అయితే కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇలా 2023 ఐపీఎల్ సీజన్లో ఒక్క వికెట్ కి ఏకంగా 10 కోట్ల రూపాయలు అందుకున్న ప్లేయర్గా నిలిచాడు. దీంతో మోస్ట్ కాస్లి ప్లేయర్ గా మారిపోయాడు అని చెప్పాలి.


 ఇక ఫెర్గ్యూసన్ తర్వాత అత్యంత కాస్లీ ప్లేయర్గా ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ ఆర్చర్ నిలిచాడు. ఆర్చర్ ని ఏకంగా 16 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగించింది. అయితే ఈ సీజన్లో అతను ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు అని చెప్పాలి. కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక దీని బట్టి చూస్తే  ఆర్చర్ ఏకంగా ఒక్క వికెట్ కి ఎనిమిది కోట్ల రూపాయలు అందుకున్నాడు అని చెప్పాలి  అదే సమయంలో ఇక సన్రైజర్స్ తరఫున ఆడిన కార్తీక్ త్యాగిని నాలుగు కోట్లకు కొనుగోలు చేస్తే.. ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతని ఒక్క వికెట్ విలువ నాలుగు కోట్లుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl