ఈ క్రమంలోనే ఇలా థర్డ్ అంపైర్లు ఎవరైనా తప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తే వారిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా భారత బ్యాట్స్మెన్ గిల్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడు అంటూ ఇక భారత జట్టు అభిమానులు అందరూ కూడా తిట్టిపోస్తూ ఉన్నారు. గిల్ ఆడిన బంతిని కామరూన్ గ్రీన్ క్యాచ్ పట్టెందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ.. థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ గా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
ఈ క్యాచ్ వ్యవహారం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అంపైర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. అవుట్ అయిన క్యాచ్ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎంపైర్లు కళ్ళకి గంతులు కట్టుకున్నారేమో.. ఇలా ఒక నిర్ణయం విషయంలో సందేహాస్పదంగా ఉన్నప్పుడు అది నాట్ అవుట్ అవుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి