ఈ క్రమంలోనే అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో చోటు దక్కించుకొని పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయినా పూజార ఇక ఒకప్పుడు టీమ్ ఇండియాకు వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయిన అజింక్య రహనేలకు చోటు దక్కుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన పూజారాని పక్కనపెట్టిన సెలెక్టర్లు అటు ఐపీఎల్ లో అదరగొట్టి డబ్ల్యూటీసి ఫైనల్ లో పరవాలేదు అనిపించిన అజీంక్యా రహానేకు మాత్రం మళ్లీ జట్టులో చోటు కల్పించారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి రహనేను ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ జట్టు గెలుపు కోసం శ్రమించే రహానేకు జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ ఏడాదికి ఫిబ్రవరిలో టెస్ట్ టీం లో చోటు కోల్పోగా తిరిగి జూన్లో టీం లోకి వచ్చాడు రహానే. అంతేగాక తిరిగి తన వైస్ కెప్టెన్ హోదాని కూడా దక్కించుకున్నాడు. దీంతో సక్సెస్ అంటే ఇదే అంటూ ఎంతో మంది కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి