
చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్ వేదికను.. అటు బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ వేదికను మార్చాలి అంటూ విజ్ఞప్తి చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిపై అటు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా ఆ దేశ మాజీ ఆటగాల్లే ఇదే విషయంపై స్పందిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తి ఏకంగా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి విజ్ఞప్తులు చేయకండి అంటూ పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మాల్ విమర్శలు గుప్పించాడు.
ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ ఈగో తోనే అసలు సమస్య అంతా ఉంది. కొన్ని వేదికలను మార్చాలి అంటూ ఐసీసీ ని పదేపదే అడగడం ద్వారా పిసిబి తనను తాను నవ్వుల పాలు చేసుకుంటుంది. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని ఆటగాళ్లు అస్సలు పట్టించుకోరు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అనవసరంగా ఈ విషయంపై రాద్ధాంతం చేస్తుంది అంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు .