క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇద్దరి భవిష్యత్తుపై కూడా త్వరలోనే ఒక స్పష్టత రానుంది. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టీ20 కెరీర్‌ను ఉద్దేశించి ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ కొత్త చీఫ్‌ సెలక్టర్‌ నియామకం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో వీరిద్దరి భవితవ్యం తేలనుందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా వైదొలగగా ఆ భాద్యతను రోహిత్ తీసుకున్నాడు. ఎన్నో విజయాలు అందించాడు కానీ మొన్న జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ లో ఓడిన తరువాత అన్నే విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. కోహ్లీ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆసియా కప్‌-2022 సందర్భంగా టీ20లలో తొలి శతకం బాదాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూసుకోలేదు.

ఇప్పటికే అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అతడి నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా రానుంది. అయితే ఆయన సెలెక్ట్ అయ్యాక టీం ఇండియాలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కోహ్లి, రోహిత్‌ టీ20 కెరీర్‌ భవిష్యత్తుపై స్పష్టత కూడా రానుందని తెలుస్తోంది. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా చేతన్‌ శర్మ రాజీనామా నేపథ్యంలో మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

హార్దిక్ కు ఛాన్స్: హార్దిక్ పాండ్యకు t20 కెప్టెన్ గా ఛాన్స్ రానుంది. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌-2024 కు హార్దిక్ ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్‌ స్వదేశానికి తిరిగి రానున్నారు. టీ20 సిరీస్‌లో జట్టును హార్దిక్ నడిపించనున్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: