ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో భాగంగా ప్రపంచ క్రికెట్ నిబంధనలో ఉన్న ఒక కొత్త రూల్ ప్రస్తుతం అందరికీ తెలిసిపోయింది. వినూత్నమైన రీతిలో శ్రీలంక ఆల్ రౌండర్ మ్యాథ్యూస్ అవుట్ అయ్యాడు అని చెప్పాలి. క్రీజు లోకి లేట్ రావడం కారణంగా టైమ్డ్ ఔట్ రూపంలో అతను పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 దీంతో ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది అయితే ఐసీసీ నిబంధనల ప్రకారమే షకిబ్ తెలివిగా ఆలోచించాడని మరి కొంతమంది.. ఇక ఈ వివాదం గురించి చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వివాదం కాస్త ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే నిబంధనల ప్రకారం కేవలం రెండు నిమిషాల లోపు బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చి తర్వాత బంతిని ఎదుర్కోవాలి. కానీ మ్యాథ్యూస్ మాత్రం ఆలస్యం కావడంతో అతన్ని అవుట్ గా ప్రకటించారు. అయితే గతంలో కూడా ఓసారి ఇలాగే జరిగింది. కానీ ఆ సమయంలో ప్రత్యర్థి జట్లు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం గమనార్హం.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణంగా బ్యాట్స్మెన్ అవుట్ అయిన మూడు నిమిషాల్లో కొత్త బ్యాటర్ క్రీజులో సిద్ధం కాకపోతే టైమ్డ్ ఔట్ అవుతారు. కానీ 2007లో సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో గంగూలీ ఆరు నిమిషాలు లేటుగా బ్యాటింగ్ కి వచ్చారు. ఓపెనర్లు రెండవ ఓవర్ లోనే అవుట్ అయ్యారు. బ్యాటింగ్ కి రావాల్సిన లక్ష్మణ్ స్నానం చేస్తూ ఉండగా.. దీంతో గంగూలి వేగంగా ప్యాడ్లు కట్టుకుని వచ్చినా ఆరు నిమిషాలు ఆలస్యమైంది. అయితే అప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా ఉన్న సునీల్ మాత్రం క్రీడా స్ఫూర్తితో గంగూలీని బ్యాటింగ్ కి అనుమతించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: