ఈ క్రమంలోనే ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్ల కోసం కొత్త నిబంధనలను ఐసిసి తీసుకువచ్చింది అన్నది తెలుస్తుంది. రిజర్వ్ డే తో పాటు సుదీర్ఘమైన అదనపు సమయం కూడా ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. డక్ వర్త్ లొయిస్ నిబంధనలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ డే తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ అసంపూర్తిగా ఉంటే లీగ్ దశలో ముందంజలో ఉన్న జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఇక సెమి ఫైనల్ కోసం అదనంగా 120 నిమిషాల సమయం కేటాయించారు. సాధారణంగా గ్రూప్ మ్యాచ్ కోసం 60 నిమిషాల సమయం మాత్రమే ఉండేది. నిర్నిత రోజున ఆటకు అంతరాయం ఏర్పడితే అంపైర్లు అదనపు సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. కుదిరితే ఆరోజే మ్యాచ్ ఫలితాన్ని సాధించడానికి ప్రయత్నించొచ్చు.
ఇక సెమీ ఫైనల్లో మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఉంటుంది. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా వాతావరణ పరిస్థితి వల్ల అంతరాయం ఏర్పడితే.. లీగ్ దశలో ఉన్నత స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఇక ఒక టీం కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. రోజులో ఇది సాధించకపోతే ఆరోజు ఆట రద్దు అవుతుంది. రిజర్వ్ డే నాడు, షెడ్యూల్ చేసిన రోజున చివరి బంతిని ఆడిన పాయింట్ వద్ద ఆట మ్యాచ్ పునః ప్రారంభం అవుతుంది. 19 ఓవర్లలో అంతరాయం ఏర్పడితే ఓవర్ లో ఒక్కో పక్షానికి 46 ఓవర్‌లకు తగ్గిస్తారు. మరో బంతి వేయకముందే వర్షం కురుస్తే ఆట రద్దు చేస్తార. సవరించిన ఓవర్ల ప్రకారం మ్యాచ్ పునఃప్రారంభం కానందున, రిజర్వ్ డే రోజు 50 ఓవర్ల వద్ద మ్యాచ్ కొనసాగించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి