ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యారు అంటే చాలు ఇక వారి జీవితం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోయి లగ్జరీ  లైఫ్ ను గడిపేస్తూ ఉంటారు క్రికెటర్లు. అయితే ఇక ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సీనియర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఎందుకంటే క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకుంటున్న ఎంతో మంది.. యువకులు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక వచ్చిన ఛాన్సులను బాగా వినియోగించుకుంటూ అదరగొడుతున్నారు. దీంతో అప్పటికే జట్టులో ఎన్నో ఏళ్ల నుంచి ప్రస్తానాన్ని కొనసాగిస్తూ తమ టాలెంట్ ఏంటో నిరూపించుకున్న సీనియర్లు యంగ్ ప్లేయర్స్ పోటీని తట్టుకునేందుకు కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతమంది ప్లేయర్లు ఇలా పోటీని తట్టుకోలేక ఒత్తిడికీ లోనై చివరికి జట్టులో చోటు కోల్పోతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది.



 ఇలా ఒకప్పుడు స్టార్ బౌలర్గా హవా నడిపించి  గత కొంతకాలం నుంచి మాత్రం టీమిండియా కు దూరమైపోయిన ఆటగాళ్ళలో భువనేశ్వర్ కుమార్ కూడా ఒకరు. ఇక అతని కెరియర్ ముగిసినట్లేనా అంటే అవును అనే సమాధానమే.. ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తుంది. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కు ప్రకటించిన జట్టులో అతడి పేరు లేకపోవడంతో.. ఈ చర్చ తెర మీదకి వచ్చింది. బంతిని పిచ్ కు రెండు వైపులా స్వింగ్ చేయగల అతడు 2013 నుండి 2018 వరకు మూడు ఫార్మట్లలో అదరగొట్టాడు  ఆ తర్వాత టెస్టులకు దూరం కాగా.. 2022 జనవరి 12న చివరి వన్డే, అదే ఏడాది నవంబర్ 22న చివరి t20 మ్యాచ్ ఆడాడు. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లాంటి యంగ్ బౌలర్లు రాణిస్తూ  ఉండడంతో ఇక సెలక్టర్లు బుమ్రాను పట్టించుకోవట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: